Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైట్ కొట్టడమే కాదు.. మా టీచర్ కు ఏకంగా లిఫ్ట్ కూడా ఇచ్చేవాడిని!: సల్మాన్ ఖాన్

  • ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన సల్లూ భాయ్
  • టీచర్లకు సైట్ కొట్టని విద్యార్థులు ఉండరని వ్యాఖ్య
  • లవ్ స్టోరీ విని నవ్వుల్లో మునిగిపోయిన అభిమానులు
ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, జరీన్ ఖాన్... బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాజీ ప్రియురాళ్ల లిస్ట్ ఇది. సినిమాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న సల్మాన్ పలువురు హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడు. అయితే తాను స్కూల్ లో చదివే సమయంలో ఓ టీచరమ్మతో ప్రేమలో పడ్డ విషయాన్ని సల్మాన్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు.

ముంబైలో జరుగుతున్న ‘దస్ కా దమ్’ కార్యక్రమానికి హాజరైన సల్మాన్.. స్కూలులో చదివే రోజుల్లో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టాడు. ‘నేను చదువుకునే రోజుల్లో స్కూల్ లో ఓ టీచర్ ను ఇష్టపడేవాడిని. ఆమె పాఠం చెబుతుంటే అలాగే చూస్తుండిపోయేవాడిని. టీచర్ ను మెప్పించేందుకు సైకిల్ పై ఎక్కించుకుని ఇంటి దగ్గర దించేవాడిని. ఆమెను సైకిల్ ముందువైపు కూర్చోబెట్టుకునేందుకు వీలుగా సైకిల్ వెనుకవైపు బ్యాగ్, లంచ్ బాక్స్ ను పెట్టేసేవాడిని’ అని సల్మాన్ చెప్పగానే అక్కడున్న వారందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

‘టీచర్ కు సైట్ కొట్టని విద్యార్థి ఉండడు. చాలామంది దీన్ని పైకి చెప్పడానికి ఇష్టపడరు. కానీ నేను మాత్రం మా టీచర్ కు సైట్ కొట్టేవాడిని’ అని సల్మాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘భారత్’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది రంజాన్ కు విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ కు జోడీగా కత్రినా కైఫ్ నటిస్తోంది.
Salman Khan
das ka dam
love story
teacher

More Telugu News